Wednesday, 22 March 2017

రోహిణి నక్షత్ర గుణగణాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు. రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి. రోహిణి మొదటి పాదము రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి. రోహిణి మొదటి పాదము గ్రహ దశలు ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి రెండో పాదము రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రోహిణి రెండో పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి మూడో పాదం రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నాలుగో పాదం రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. గ్రహ దశలు తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నక్షత్రము గుణగణాలు ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.


నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రం - రోహిణి
అధిపతి - చంద్రుడు
గణము -  మానవ
జాతి - స్త్రీ
వృక్షం - నేరేడు
జంతువు - సర్పం
నాడి - అంత్యనాడి
పక్షి -గుడ్ల గూబ
అధిదేవత -బ్రహ్మ
రాశి - వృషభము

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
రోహిణి, హస్త, శ్రవణంశ
రీరశ్రమ

సంపత్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
ధన లాభం

విపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
కార్యహాని

సంపత్తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
క్షేమం

ప్రత్యక్ తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
ప్రయత్న భంగం

సాధన తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
అశ్విని, మఖ, మూల
బంధనం

మిత్ర తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
సుఖం

అతిమిత్ర తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
సుఖం, లాభం

రోహిణి నక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభరాశి.
3 వ పాదము - మిధునరాశి.
4 వ పాదము - కర్కాటకరాశి.

రోహిణి మొదటి పాదం

ఇతర విషయాలమీద ఎక్కువగా ఆలోచనలు సాగిస్తారు. తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్నిబట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి.
గ్రహ దశలు   
తొలుత చంద్ర మహర్దశ 10 సం.లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, ఆపై గురు మహర్దశ 16 సం.లు, శని మహర్దశ 19 సం.లు, బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
తనుమళ్లలోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామిని దర్శించాలి.

హిణి  రెండో పాదం

అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని ఉపయోగించు కుంటారు. ఈ ప్రక్రియలో ప్రతిభా వంతంగా గుర్తింపు తెచ్చుకుం టారు. అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి.  మాటలాడే విషయంలో పటుత్వం కలిగిఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. దీనివల్ల అనవసర ఆందోళనలు తగ్గించుకునేందుకు వీలవుతుంది.
గ్రహ దశలు  
తొలుత చంద్ర మహర్దశ ఏడున్నర సం.లు, ఆ తర్వాత కుజ  7 సం.లు, రాహు 18 సం.లు,  గురు 18 సం.లు, శని19 సం.లు, బుధ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
కాజులూరులోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే శుభప్రదం.

రోహిణి మూడో పాదం

మనసులో రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. వాటిని బయటపెట్టకుండా ప్రవర్తిస్తుం టారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. కానీ, శాస్త్రాన్ని, అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మరింత అధిక ఫలితం లభిస్తుంది. అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి.
గ్రహ దశలు  
తొలుత చంద్ర మహర్దశ 5 సం.లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు మహర్దశ 18 సం.లు, శని మహర్దశ 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
ఐతపూడిలోని శ్రీఅన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామిని అర్చించాలి.

రోహిణి నాలుగో పాదం

అంది వచ్చిన అవకాశాల్ని పసిగట్టి నడుచుకొందురు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగలవచ్చును. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. సదా స్పష్టతకోసం ఆశిస్తారు. కాస్తంత పట్టు దొరికితే అవగాహన సంపాదిస్తారు.
గ్రహ దశలు  
తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సం.లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు మహర్దశ 18 సం.లు, శని మహర్దశ 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
శీలలోని శ్రీఉమా సమేత రామలింగేశ్వర స్వామిని అర్చించుకుంటే మంచిది

స్వతహాగా రోహిణి నక్షత్ర జాతకులు పట్టుదలను కనబరిచే వ్యక్తులుగా ఉంటారు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో కొన్ని ఆందోళనలు ఎదుర్కొనవచ్చును. అయినా ముందుకు సాగడానికి ఇష్టపడతారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సర్దుకొని పనిచేసుకు పోగల నేర్పు ఉంటుంది. చాకచక్యంకన్నా పైచేయి ఎక్కువ పాళ్లలో ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త అవసరం.  రోహిణి నక్షత్రంవారు నేరేడు చెట్టును పెంచుకోవాలి.  రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి.

వృక్షం : నేరేడు

               శ్లోకం :  రోహిణి పంచతారాశ్చ జంబూ వృక్షశ్చ త్రికోణకృత:

                          పీత వర్ణ మయూరేచ కమలపుష్య ముత్శిరతం

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 12 నుండి 15 వరకు ఉన్న శ్లోకములు రోహిణి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పోతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.


ఫలితం : ఈ నక్షత్రం వారికి వ్యవసాయం, తత్ సంబందములు కలిసి వస్తాయి. పై విధంగా చేయుటవలన వీరికి దీర్ఘకాల వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.

నామ మొదటి అక్షరములు
1 వ పాదం  (ఓ)
2 వ పాదం (వా)
3 వ పాదం  (వి)
4 వ పాదం   (వు)

రోహిణి నక్షత్రం అదృష్ట రత్నం
ముత్యం

అదృష్ట వర్ణం
తెలుపు

వారం
సోమవారం,  శనివారం

No comments:

Post a Comment