Wednesday, 22 March 2017

ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము,తీఱు-తెన్నులుసవరించు

ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.

అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
ఆర్ద్ర, స్వాతి, శతభిషశ
రీరశ్రమ

సంపత్తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
ధన లాభం

విపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
కార్యహాని

సంపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
క్షేమం

ప్రత్యక్ తార
అశ్విని, మఖ, మూల
ప్రయత్న భంగం

సాధన తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
బంధనం

మిత్ర తార
రోహిణి, హస్త, శ్రవణం
సుఖం

అతిమిత్ర తార
మృగశిర, చిత్త, ధనిష్ట
సుఖం, లాభం

ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.

నక్షత్రం - ఆరుద్ర
అధిపతి - రాహువు
గణము -మానవ
జాతి. -  స్త్రీ
జంతువు - శునకం
వృక్షము - రేలా
నాడి - ఆది
పక్షి -  పింగళ
అధిదేవత - రుద్రుడు
రాశి - మిథునం

ఆరుద్ర నక్షత్ర లక్షణాలు 

ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా చెబుతారు. అందువల్ల ఈ నక్షత్ర జాతకులు తీక్షణ స్వభావంతో వ్యవహరిస్తారు. అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం కనిపిస్తుంది. సుదీర్ఘ నిరీక్షణతో ఫలితం లభిస్తూ ఉంటుంది. చపలచిత్తంతో వ్యవహరించినప్పటికీ చురుగ్గా పరిశీలన చేస్తూ గమించగలుగుతారు. ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం.  
ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేయటం మేలు.  ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. గోమేధికం రాయి పెట్టుకోదగినది.  ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు మిధున రాశిలోనే ఉంటాయి.

ఆరుద్ర మొదటి పాదం

అన్ని విషయాలు తమకే కావాలని భావిస్తారు. అదృష్టంతో నెగ్గుకు రావాలని ప్రయత్నిస్తుంటారు. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీనివల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. ఆచార వ్యవహారాలపై శ్రద్ధ ఉంటుంది.
గ్రహ దశలు   
ఈ పాదంలో జన్మించినవారికి మొదట రాహు మహర్దశ 18సం.లు ఉంటుంది.  తదుపరి గురు మహర్దశ 16సం.లు, శని మహర్దశ 19 సం.లు, బుధ మహర్దశ 17సం.లు, కేతు మహర్దశ 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం  
తూర్పు గోదావరి జిల్లా పెనుమళ్ల లోని శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామిని అర్చించుకోవడం మేలు

ఆరుద్ర రెండో పాదం

ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. ఇతర విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యంమీద దృష్టిపెడతారు. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కాస్త గందరగోళానికి గురవుతారు.
గ్రహ దశలు   
రాహు మహర్దశ పదమూడున్నర (13.6) సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం  
తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లపాలెంలో కొలువైన శ్రీపార్వతీ సమేత గోకర్ణేశ్వరస్వామిని ఆరాధించటం ఉత్తమం.

ఆరుద్ర మూడో పాదం

చురుకుదనం ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తలబొప్పి కట్టించుకుంటారు. వాయు తత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుంది. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే లాభం దక్కుతుంది.
గ్రహ దశలు   
రాహు మహర్దశ 9సం.లు, గురు మహర్దశ 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.


ఆరుద్ర  నాలుగో పాదం

లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించటం, నిలకడ సాధించడం చాలా ముఖ్యం. నిదానమే ప్రధానం అన్న సూక్తిని గుర్తుంచుకోవాలి. కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా నెగ్గుకొని రావాలన్న యోచనను సమర్థంగా వినియోగించుకోవాలి.
గ్రహ దశలు   
రాహు మహర్దశ నాలుగున్నర (4.6)సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం  
తూర్పుగోదావరి జిల్లాలోని కూరాడలో కొలువైన శ్రీభద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామిని పూజించడం మేలు.

ఆరుద్ర నక్షత్రం

ఆరుద్ర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలుఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది.ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి.ఆరుద్ర మొదటి పాదముఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది.ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి. ఆరుద్ర రెండో పాదముఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర మూడో పాదముఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర నాలుగో పాదముఆరుద్ర నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.ఆరుద్ర నాలుగో పాదములో గ్రహ దశలు నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.ఆరుద్ర నక్షత్రము – గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు.ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు.

ఆరుద్ర నక్షత్రం :

                వృక్షం : గుమ్మిడి

                శ్లోకం  : ఆర్ద్రేక తారాశ్చ పీతవర్ణ కృష్ణ ఖదిరో భవత:

                           దత్తూర పుష్ప పింగళ పక్షీచ రత్నేగోమేధికంతధాః 

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 20 నుండి 23 వరకుగల శ్లోకములు ఆరుద్ర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.


ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి మనోబలం లభిస్తుంది. గొంతుకు సంబందించిన వ్యాదులు ఉపశమనం చెందుతాయి.

అదృష్ట వారం
సోమవారం, శుక్రవారం

అదృష్ట సంఖ్య
 4, 5

ఆరుద్ర నక్షత్రము నవాంశ

1 వ పాదము -మిధునరాశి.
2 వ పాదము - కన్యారాశి.
3 వ పాదము - తులారాశి.
4 వ పాదము - వృశ్చికరాశి.

నామ ప్రథమ అక్షరాలు
1 వ పాదం.  ( కూ)
2 వ పాదం   (ఘం)
3 వ పాదం   (జ్ఞా)
4 వ పాదం.  (ఛ)

No comments:

Post a Comment