ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, గణము మనుష్య, రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రమున జన్మించిన వారు తంద్రి వలన ప్రయోజనము పొందుతారు. సహోద్ర వర్గము బలముగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో ఔతుంది, ఉద్యోగము లెక వ్యాపారము ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రమ్గములో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బమ్ధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్తిన దానికి వమ్దరెట్లు ఫలితము ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపమ్చము సరిగా అర్ధము చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దసలు విరికి యోగిస్తాయి.
ఉత్తర ఫల్గుణీ నక్షత్రం- గుణగణాలు, ఫలితాలు ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది 12వది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి. ఉత్తర ఫల్గుణీ మొదటి పాదము మొదటి పాదములో జన్మించిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి. ఇక 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్ధశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా 9వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి. ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము ఉత్తర నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 4 సంవత్సరముల 6 నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుంచి 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. ఉత్తర ఫల్గుణీ మూడవ పాదము వీరికి స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదము ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించాలి. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ. కాబట్టి ముత్యంను వెండిలో ఉంగరము వేలుకు ధరించాలి. 11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ. కాబట్టి పగడంను బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. 30 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ. కాబట్టి నీలంను వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహమవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. తేనెటీగ లాగా కూడబెడతారు. నైతిక బాధ్యతలు అధికం. ఇక వైవాహిక జీవితంలో సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.
ఉత్తర (ఉత్తర ఫల్గుణి) నక్షత్రం
వృక్షం : జువ్వి
శ్లోకం : ఉత్తరఫల్గుణీద్వితారాశ్చ వాలువృక్షదండాకృతి:
కృష్ణ వర్ణ కర వీరేచ క్రౌంచ పక్షౌ కెంపు రత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 45 నుండి 48 వరకు గల శ్లోకములు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన వారికి జీవితంలో మంచి స్నేహితులు, దానివలన మంచి సలహాలు సమయమునకు అందుతాయి. మరియు వీరు స్వయంగా మరి కొందరికి సహాయం చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
ఉతార ఫల్గుణినక్షత్ర వివరాలు
ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది పన్నెండవది.
నక్షత్రం -ఉత్తర ఫల్గుణి
అధిపతి -సూర్యుడు
గణము -మానవ
జాతి - స్త్రీ
జంతువు -గోవు
వృక్షము - జువ్వి
నాడి - ఆది
పక్షి -వడ్రంగిపిట్ట
ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మ తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
శరీరశ్రమ
సంపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
ధన లాభం
విపత్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
కార్యహాని
సంపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
క్షేమం
ప్రత్యక్ తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
ప్రయత్న భంగం
సాధన తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
బంధనం
మిత్ర తార
అశ్విని, మఖ, మూల
సుఖం
అతిమిత్ర తార
భరణి, పూర్వ ఫల్గుణి,పూర్వాషాఢ
సుఖం, లాభం
ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - ధనసురాశి.
2 వ పాదము - మకరరాశి.
3 వపాదము - కుంభరాశి.
4 వ పాదము - మీనరాశి.
అదృష్ట వారం
ఆదివారం, బుదవారం
అదృష్ట సంఖ్యలు
5, 6
అదృష్ట రత్నం
కెంపు
నామ ప్రధమ అక్షరాలు
1. వ పాదము ( టే) సింహ రాశి
2. వ పాదము (టో)కన్య రాశీ
3. వ పాదము ( పా) కన్య రాశి
4. వ పాదము. (పి) కన్యరాశి
No comments:
Post a Comment