Wednesday, 22 March 2017

పూర్వఫల్గుణిి నక్షత్రము గుణగణాలు



పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు వీరికి బాల్యములో కొంత వరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. లౌక్యము, అధికారము కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించె కారణముగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యొగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి మందుకు పోలేరు. సౌమ్యులే అయినా గమ్భిరత కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు. సివిలు కెసులను ఎదుర్కొంటారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమిమ్చి సాధిమ్చిన దానిని వైరి వర్గానికి ధారపొస్తారు. స్నెహితుల ఉచ్చు నుండి కోమ్దరు జీవితకాలము వరకు బయట పడలేరు. బయట కనిపించె జీవితము కాక రహస్య జీవితము వెరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేస విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మమ్చి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితము స్నేహానికి అంకితము. వీరవిద్యలలో రాణిస్తారు.

పుబ్బ నక్షత్రం (పూర్వ ఫల్గుణి) :

వృక్షం : మోదుగ

శ్లోకం : పూర్వ పల్గుణీద్వితారాశ్చ పాలశో దండాకృతిః
          కృష్ణ వర్ణ నంది వర్దేచ కాక పక్షీచ వజ్రం తధా !

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 41 నుండి  44 వరకు గల శ్లోకములు పుబ్బా నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.


ఫలితం : ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వారి జీవనంలో ప్రశాంతత లభిస్తుంది. మనోబలం పెంపొందుతుంది. సంతానలేమి తొలగుతుంది.

పూర్వఫల్గుణీ నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు

పూర్వఫల్గుణీ నక్షత్రములలో ఇది 11వ నక్షత్రము. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది. ఈ నక్షత్రము అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. జాతి పురుష జాతి. జంతువు సింహం, ఆధిదేవత భర్గుడు, రాశి సింహా రాశి. పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము సింహరాశి, రెండవ పాదము - కన్యారాశి, మూడవ పాదము - తులారాశి, నాలుగవ పాదము - వృశ్చికరాశి.

పూర్వఫల్గుణీ మొదటి పాదము
ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి. అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు. స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది.

పూర్వఫల్గుణీ రెండవ పాదము
పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించాలి. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. కనుక ఈ సమయాన ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ. కాబట్టి కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది.

పూర్వఫల్గుణీ మూడోపాదము
పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ. అందువల్ల కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. అందువల్ల పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది. కనుక గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 51 నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ. అందువల్ల కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి మీరు నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

పూర్వఫల్గుణీ నాలుగో పాదము
పుబ్బ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ. అందువల్ల కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

పూర్వఫల్గుణి నక్షత్రము - గుణగణాలు

పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. అందువల్ల వీరి బాల్యం సుఖమయంగా గడుస్తుంది. విద్యాభ్యాసముకు ఎలాంటి ఆటంకం కూడా రాదు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించే స్వభావం వల్ల అధికారులుగాను, నాయకులుగానూ రాణిస్తారు.

ఇక ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని, సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యా దానము చేస్తారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమించి సంపాదించిందంతా వైరి వర్గానికి ధారపొస్తారు.

మిత్రుల ఉచ్చు నుంచి కొందరు జీవితకాలమంతా బయటపడని సందర్భం ఎదురు కావొచ్చు. బయటకి కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు.

పుబ్బ నక్షత్రమున జన్మించిన వారు అలంకారములన్న ఇష్టము కలిగి యుందురు . సినిమాలు , సాహిత్యము రచనా , నాటక రంగములలో బాగా రాణిస్తారు . వీరి జన్మ నక్షత్ర అధిపతి శుక్రగ్రహము . అందు వలన సంగీతాది విద్యలలో ప్రవేశము ఉంటుంది . సంప్రదాయములను పాటిస్తారు . దూర దృష్టి కలవారు . ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పనీ చెయ్యరు . ధనవంతులు, చేసిన మేలును , ఇతరుల వలన కలిగిన ఉపకారమును మరచి పోతారు .


స్వార్ధముఎక్కువ. అవకాశవాదులు . తనకు హాని జరిగితే పగబట్టి మరీ కక్ష తీర్చుకొంటారు . స్త్రీ సౌఖ్యమునకై అల్లాడుచుందురు. ఇతరులకు సహాయ పడరు . ప్రతి పనిలోనూ లాభము కలుగ వలెననీ అనుకొంటారు. బుద్ది ,విచక్షణ జ్ఞానమును , తెలివి తేటలను ఉపయోగించి  బ్రతుకుతారు . శారీరకముగా కష్టపడుటకు ఇష్ట పడరు . కొన్ని అవలక్షణములు ఉన్నా దానగుణము కలవారు . దైవముపై నమ్మకము ఉంటుంది . కానీ చెప్పే మాటలకు , చేసే పనులకు సంభందము ఉండదు .


నీతి వాక్యాలను వల్లిస్తారు . మనసు విప్పి మాట్లాడరు. లోపల ఉన్న విషయమొకటి పైకి మాట్లాడేది మరొకటి గా ఉంటుంది . ధనమే ముఖ్యము అను మనస్తత్వముతో ఉంటారు . వాహన సౌఖ్యములు పొందుతారు . గృహ నిర్మానాది యోగములు కలవారు . సుగంధ ద్రవ్యములు , ఫల పుష్పములు మొదలగు వాటిపై మక్కువ ఎక్కువ .


ఏ విషయమైనా కావచ్చు గానీ ఒకటికి పదిసార్లు లేక్కవేసుకొని లాభ నష్టములను విచారించి ముందుకు వెళతారు .భక్తీ , ముక్తి మొదలగు విషయముల గురుంచి అనర్గలముగా మాటలాడుటలో నేర్పరులు . శారీరక సౌందర్యము కలవారు . ఎప్పుడు నూతన వస్తువులను ఇష్టపడతారు . పాత వస్తువులను , పాత పద్దతులను ఇష్టపడరు . ఎంత సేపు వీరు తమ సౌఖ్యమున కొరకే పాటు పడతారు .


తొందరగా ఆకర్షితులు కాగలరు . పేకాట , త్రాగుడు , అక్రమ సంభంధములు మొదలగు వ్యసనములకు బానిసలు కాగలరు . జాగ్రత్త వహించినచో జీవితమున అన్ని విధములుగా అభివృద్ది సాధించ గలరు .     

నక్షత్రం - పూర్వఫల్గుణి
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - పురుష
జంతువు - సింహం
వృక్షము - మోదుగ
నాడి - మధ్య
పక్షి- పెద్దపక్షి
అధిదేవత -
రాశి 1,2,3,4 పాదాలు సింహ రాసిలోనే ఉంటాయి

పూర్వఫల్గుణి నక్షత్రజాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
శరీరశ్రమ

సంపత్తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
ధన లాభం

విపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్యహాని

సంపత్తార
మృగశిర, చిత్త, ధనిష్ట
క్షేమం

ప్రత్యక్ తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
ప్రయత్న భంగం

సాధన తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
బంధనం

మిత్ర తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
సుఖం

అతిమిత్ర తార
అశ్విని, మఖ, మూల
సుఖం, లాభం

పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ

1 వ పాదము - సింహరాశి.
2 వ పాదము - కన్యారాశి.
3 వ పాదము - తులారాశి.
4 వ పాదము - వృశ్చికరాశి.

అదృష్ట రత్నం
వజ్రం

అదృష్ట వారం
ఆదివారం, శుక్రువారం

అదృష్ట సంఖ్యలు
1,5

అదృష్ట రంగులు
తెలుపు, ఎరుపు

నామ నక్షత్ర ప్రథమ అక్షరాలు
1, వ పాదం ( మో)
2, వ పాదం (టా)
3, వ పాదం  (టి)
4, వ పాదం  (టు)

No comments:

Post a Comment