Tuesday, 21 March 2017

విశాఖనక్షత్రము గుణగణాలు

విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలైతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చెస్తారు. విరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడము వ్యర్ధము. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లెక స్త్రి సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చెస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగము వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చెసె ఉద్యోగానికి సమ్బంధము ఉండదు. ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారము ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టము ప్రయోజనము సమముగా ఉంటాయి. కథినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీపౌరసత్వము లభిస్తుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది.


విశాఖ నక్షత్రమున జన్మించిన వారు తెలివైన వారు . బుద్ది మంతులు , మంచి ఆచార సంప్రదాయములను కలిగి ఉందురు . మృదువుగా మాటలాడుదురు . ధనమునకై తాపత్రయ పడక పేరు ప్రఖ్యాతలు సంపాదించ వలెనను కోరిక కలిగి ఉందురు . తీర్ధయాత్రలు చేయుట వీరికి ఇష్టము . సున్నితమైన సుకుమార వంతమైన శరీరము కలవారు . ఇతరులను ఆకర్శించుకోను రూపము కలిగి ఉందురు . ధన వంతులు , బంధువుల పై ప్రేమ కలవారు .


మంచి విద్యాభ్యాసము చేయుదురు . ఈ నక్షత్రమున జన్మంచిన కొందరు గ్రహ శాస్త్రమును , ఖగోళ శాస్త్ర సంభంధమైన పరిశోధనలు చేయువారగుదురు. తనకు హాని తలపెట్టిన వారిని గుర్తించుకొని మరీ వారిపై పగ తీర్చుకొంటారు . భార్య భర్త వైవాహిక జీవితములో  కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు . ప్రతి విషయమును చాలా దీర్గముగా ఆలోచించుట వలన ఇబ్బందులు తప్పవు . చిన్న చిన్న విషయములను కూడా భూతద్దములో పెట్టి చూస్తారు . తొందరగా మరచిపోరు . వితండ వాదము చేస్తారు .   


వీరు పరిశీలనా జ్ఞానము కలవారు . ఇతరుల పై జాలి దయ కలిగిన వారే కానీ అసూయ పరులు . అన్నింటా తామే ముందుండ వలెనని అనుకొందురు. జయాపజయములను సమానముగా స్వీకరించ లేరు . మనో నిగ్రహము కలవారు . జాగ్రత్త పరులు . అవసరమునకు మించి జాగ్రత్త వహించుట వలన పిసినారులని అనబడుదురు .వయస్సు పెరిగే కొలది మంచి సంస్కారము అలవడును . పెద్ద మనుషులుగా రాణిస్తారు .


రాజకీయ వ్యవహారములలో పదవులను చేపట్టుట , సంభందిత వ్యవహారములలో పాల్గొనుచుందురు . ధన సంపాదన బావుండును. రెండు లేక మూడు విధములుగా ఆదాయము వచ్చే విధముగా ఏర్పాట్లు చేసుకొందురు. లక్ష్మీ కటాక్షము ఉండును. తొందరగా ముసలి వారగుదురు . అనగా తక్కువ వయసే అయినప్పటికీ ముదుసలి స్వరూపము వలె కన్పింతురు. కొంత హంగు ఆర్భాటములను ప్రదర్శించడం , తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం వీరికి అలవాటు .   


విశాఖ నక్షత్రం:

వృక్షం : వెలగ

శ్లోకం : విశాఖేశ్చతుతాశ్చ బిల్వేశూర్పాకారం భవేత!
          రక్త వర్ణ బంధూకశ్చ పింగళే పుష్యరాగం తధా!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 61 నుండి 64 వరకు గల శ్లోకములు విశాఖ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.


ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన  ఉదర సంబంధములయిన వ్యాదులు ఉపశమనం చెందుతాయి. మనోబలం పెరుగుతుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది.

నవాంశ ఆధారిత గుణాలు

విశాఖ నక్షత్ర మొదటి పాదం :-  విశాఖ నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది.  మేషరాశి అధిపతి కుజుడు .  విశాఖ నక్షత్ర  అధిపతి గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం . అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది.   విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కాలేజ్ చదువులలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం   జీవితకాలం సహకరిస్తుంది. 33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.విశాఖ నక్షత్ర రెండవ పాదం :-   విశాఖ నక్షత్ర రెండవ పాదం వృషభరాశిలో ఉంటుంది.  వృషభరాశి అధిపతి  విశాఖ నక్షత్ర  శుక్రుడు .  విశాఖ నక్షత్ర  గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.   వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అత్యంత అనుకూలం . ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపువర్ణ వస్తువులు, శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు,  వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యారంభం బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది .  10 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం   జీవితకాలం సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. విశాఖ నక్షత్ర మూడవ పాదం :-  విశాఖ నక్షత్ర మూడవ పాదం మిధునరాశిలో ఉంటుంది.  మిధునరాశి అధిపతి బుధుడు .  విశాఖ నక్షత్ర గురువు.  విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.  నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.   వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు.  విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువ. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం,  వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.  విద్యలో  ఆరంభం నుండి  మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది .   6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.  తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. వివాహం సకాలంలో జరుగుతుంది. 42 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నేలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. విశాఖ నక్షత్ర నాలుగవ పాదం :-  విశాఖ నక్షత్ర నాలుగవ పాదం కటకరాశిలో ఉంటుంది.  విశాఖ నక్షత్ర అధిపతి గురువు.   విశాఖ  రాక్షసగణ నక్షత్రం కనుక నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.   ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.   ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం . పుట్టిన కొంత  కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సౌక్యం తగ్గుతుంది. ఔషధ సంబంధిత ,  శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.   తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు.   6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువా వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. విద్యాభ్యాసంలో మందకొడితనం ఉంటుంది.  21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.  38  సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం.  45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

నక్షత్రములలో ఇది 16 వ నక్షత్రం

నక్షత్రం - విశాఖ.
నక్షత్రాధిపతి - గురువు
అధిదేవత - ఇంద్రుడు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
జంతువు - వ్యగ్రము
పక్షి - గరుడము
వృక్షము - నగకేసరి
రత్నం - పుష్యరాగం
నాడి - అంత్య
రాశి - 1,2,3 తులా 4 వృచ్చికం

విశాఖ నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
శరీరశ్రమ

సంపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
ధన లాభం

విపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
కార్యహాని

సంపత్తార
అశ్విని, మఖ, మూల
క్షేమం

ప్రత్యక్ తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
ప్రయత్న భంగం

సాధన తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
రోహిణి, హస్త, శ్రవణం
బంధనం

మిత్ర తార
మృగశిర, చిత్త, ధనిష్ట
సుఖం

అతిమిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం, లాభం

విశాఖనక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభకరాశి.
3 వ పాదము - మిధునరాశి
4 వ పాదము - కర్కాటకరాశి

అదృష్ట వారం
శుక్రువారం గురువారం

అదృష్ట సంఖ్య
9

అదృష్ట రత్నం
పుష్యరాగం,

నామ ప్రధమ అక్షరాలు
1వ పాదం (తీ
2వ పాదం  (తూ)
3వ పాదం (తే)
4వ పాదం (తో)

No comments:

Post a Comment