అనూరాధా నక్షత్రము అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రము. అధిదేవత సూర్యుడు. జంతువు జింక. రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షత్రములో జన్మించిన వారు జలక్రీడలందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవము కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితములో స్థిరపడడానికి సమయము పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలములో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతముగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పముగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గము నుండి నమ్మకద్రోహము ఎదురౌతుంది. తండ్రి పద్ధతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగము ఉంటుంది. సహోదర సహోదరీ వర్గము బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానము, దూరప్రాంత ఉద్యోగము, దూరప్రాంత విద్యా విధానము మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతముగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యము మిశ్రమము చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధము ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభము సంపాదించిన రంగములో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యము అన్ని విధాలుగా బాగుంటుంది.
భారత కాలమానం ప్రకారం నక్షత్రములలో 'అనూరాధ నక్షత్రము' ఒకటి. నక్షత్రములలో ఇది 17వ నక్షత్రం.
అనురాధ నక్షత్రం
వృక్షం : పొగడ
శ్లోకం : అనూరాధా షల్తూరాశ్చ నీల మౌళో మాలాకృతిః
శుక పద్మ పుష్పంచ నీలం రత్నం యధా చరేత!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 65 నుండి 68 వరకు గల శ్లోకములు అనురాధ నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరి ఆలోచనా శక్తి పెరుగుతుంది. కాలేయ సంబందిత వ్యాదులు తొలగుతాయి. సకల విద్యలలో రాణించగలుగుతారు.
అనురాధ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు
నక్షత్రములలో 17వది అనురాధ నక్షత్రము. అనురాధ నక్షత్రాధిపతి శని, ఆధిదేవతలు సూర్యుడు, రాజ్యాధిపతి కుజుడు, ఇది దేవగణ నక్షత్రము, జంతువు మహిషి, రత్నం గోమేధికం.
అనురాధ నక్షత్ర మొదటి పాదము
అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం కావడం వల్ల వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు స్వభావ రీత్య బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను సూటిగా తెలియజేస్తారు. తండ్రితో అభిప్రాయభేదాలు కలుగ వచ్చు. తల్లితో ఏకీభవిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.
ఈ నక్షత్ర జాతకులకు తొలి 17 సంవత్సరాల జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో కాస్త మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధద శ కారణంగా కళాశాల చదువులలో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.
వీరికి ప్రభుత్వపరమైన కర్మాగారాలు, పరిశ్రమలలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అగ్ని సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
అనురాధ నక్షత్ర రెండవ పాదము
వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు. వీరికి మేధో సంబంధమైన వృ త్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వీరికి బుధ దశ అనుకూలించడం వల్ల విద్యలో ఉన్నతిని సాధించగలరు. 13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా మాధ్యమిక తరగతి నుంచి చదువులలో మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత జీవితం సౌఖ్యంగా, సాఫీగా కొనసాగుతుంది.
అనురాధ నక్షత్ర మూడవ పాదము
వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు. తమ అభిప్రాయాలను సూటిగా, ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమించి పూర్తి చేస్తారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు.
వీరికి బుధ దశ బాగా అనుకులించడం వల్ల విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు. 8 సంవత్సరాల వరకు మందకొడిగా సాగే విద్యాభ్యాసం తరువాత వచ్చే సంవత్సరాల 17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. 25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 75 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఈ నక్షత్ర జాతకులకు ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు.. వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.
అనూరాధ నక్షత్రము నాలుగో పాదము
ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు.
4 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. కేతు దశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.
అనురాధ నక్షత్రము గుణగణాలు
ఇది దేవగణ నక్షత్రము కావడం వల్ల ఈ నక్షత్ర జాతకులు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. పని పూర్తి చేయడంలో బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని ఇతర విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు.
పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధు వర్గం నుంచి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రి వ్యవహార తీరు నచ్చదు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది.
నక్షత్రం - అనురాధ
అధిపతి - శని
గణము - దేవ
జాతి - పురుష
జంతువు - జింక
వృక్షము -పొగడ
నాడి - మధ్య
అధిదేవత- సూర్యడు
రాశి - 1,2,3,4 పాదాలు వృచ్చిక రాశి
అనూరాధా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మ తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
శరీరశ్రమ
సంపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
ధన లాభం
విపత్తార
అశ్విని, మఖ, మూల
కార్యహాని
సంపత్తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
క్షేమం
ప్రత్యక్ తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
ప్రయత్న భంగం
సాధన తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
మృగశిర, చిత్త, ధనిష్ట
బంధనం
మిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం
అతిమిత్ర తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
సుఖం, లాభం
అనూరాధనక్షత్రము నవాంశ
1 వ పాదము - సింహం
2 వ పాదము - కన్య
3 వ పాదము - తులా
4 వ పాదము - వృచ్చికం
అదృష్ట రత్నం
నీలం
అదృష్ట వారం
శనివారం, సోమవారం
అదృష్ట సంఖ్యలు
7, 9
నామ ప్రధమ అక్షరాలు
1 వ పాదము (నా)
2 వ పాదము (ని)
3 వ పాదము (ను)
4 వ పాదము (నే)

No comments:
Post a Comment