Wednesday, 22 March 2017

మృగశిరా నక్షత్రము గుణగణాలు

మృగశిరా నక్షత్రము గుణగణాలు

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తా
రమృగశిర, చిత్త, ధనిష్ట
శరీరశ్రమ

సంపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
ధన లాభం

విపత్తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
కార్యహాని

సంపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రక్షేమం

ప్రత్యక్ తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
ప్రయత్న భంగం

సాధన తార
అశ్విని, మఖ, మూల
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
బంధనం

మిత్ర తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
సుఖం

అతిమిత్ర తార
రోహిణి, హస్త, శ్రవణంసుఖం, లాభం

మృగశిర నక్షత్రము నవాంశ

1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభరాశి.
3 వ పాదము - మిధునరాశి.
4 వ పాదము - కర్కాటకరా

నక్షత్రం - మృగశిర
అధిపతి - కుజుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - చండ్ర
జంతువు - సర్పం
నాడి - మధ్య
పక్షి - కోడి
రాశి - 1,2 వృషభం 3,4

మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరించాల్సి ఉంటుంది.
 నామ నక్షత్రం అక్షరాలు

1 వ పాదము వె
2 వ పాదము  వో
3 వ పాదము  కా
4 వ పాదము  కి

మృగశిర నక్షత్ర విశేషాలు

మృగశిర నక్షత్రంలో చురుగ్గా మారిపోయే స్వభావం కనిపిస్తుంది. ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మారిపోతాయి. నాయకత్వ స్థాయిలో ఉండేవారికి అవసరమైన స్థితప్రజ్ఞత ఉండదు. కానీ ఆచరణలో అమలు చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను లౌక్యంగా అధిగమించగలరు. ప్రతికూలతలను పదే పదే ఊహించుకోవడంమాత్రం ఇబ్బందికరం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి.
ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్ర జాతకులు చండ్ర వృక్షాన్ని పెంచుకుంటే మంచిది. హోమం సమయంలోకూడా చండ్ర సమిధలు వాడడం మేలు. తమో గుణంతో ఉండటం వీరి లక్షణం. ఆధిపత్యం చంద్ర దేవతను సూచిస్తోంది. పగడం రాయి పెట్టుకోదగినది. 

మృగశిర  నక్షత్రం మొదటి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిధున రాశిలోనూ ఉంటాయి.

మృగశిర మొదటి పాదం

అదృష్టానికి, దురదృష్టానికి వీరిదే బాధ్యత ఉంటుంది. తమ తమ పనులవల్లనే కార్యసిద్ధి పొంద గలరు. అదే సమయంలో తమ వైఖరి వల్లనే నష్టాలుసైతం ఎదు ర్కొంటారు. వేచి చూసే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఒక్కోసారి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థి తులు వికటిస్తే ఈ నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి. అటువంటప్పుడు శాంతంగా ఉండడం అవసరం. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవని గ్రహించాలి.
గ్రహ దశలు    
తొలుత  కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు 18 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 10 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు లోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది. 

మృగశిర రెండో పాదం

ప్రతి పనిలోను పూర్తి ఫలితం ఆశిస్తారు. సమగ్రమైన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. ఆందోళనతో మరిన్ని తప్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. తెలివితేటలు ఉపయోగించాల్సినచోట వాడకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని రావాలి.
గ్రహ దశలు  
తొలుత  కుజ మహర్దశ 5 సం. 9నెలలు, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు,  అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 20 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం 
తూ.గో.జిల్లా గురజనాపల్లిలోని శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం.

మృగశిర మూడో పాదం 

ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి చాలా దూరంగా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆందోళనలను దాచుకునేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటిస్తారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడు తుంది. ఈ నక్షత్ర పాదంలో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.
గ్రహ దశలు  
జన్మించిన లగాయితు మూడు న్నర సం.లు కుజ మహర్దశ, తర్వాత రాహు 18 సం.లు, గురు  16 సం.లు, శని 19 సం.లు, బుధ  17సం., కేతు 7సం., శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం 
తూర్పు గోదావరి జిల్లా అండ్రంగి గ్రామంలోని పార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే నక్షత్ర దోష నివారణ జరుగుతుంది.

మృగశిర నాలుగో  పాదం

మృగశిర నాలుగో పాదంవారు సాధు స్వభావంతో ఉంటారు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఓపికతో వేచిచూసే లక్షణం కనిపించదు. దీనివల్ల ఫలితాలు వచ్చే సమయంలో పరిస్థితులను మార్చుకుంటారు. అంతిమంగా అసహనానికి లోనయ్యే స్వభావం ఉంటుంది. నిలకడకోసం ప్రయత్నించుట మేలు.
గ్రహ దశలు  
పుట్టినప్పటినుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ, తర్వాత రాహు 18సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం 
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ శివారుల్లోని జగన్నాథ గిరిలోగల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే విశేష ఫలితం. 

మృగశిర నక్షత్రం:

            వృక్షం : కదిరి

            శ్లోకం  : మృగశిరాత్యితారాశ్చ ఖదిరోదండాకృతి:

                        శ్వేతపర్ణ  మయూరశ్చ కుముద పుప్ప పగడం తధా

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 16 నుండి 19 వరకు ఉన్న నాలుగు శ్లోకములు మృగశిర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు.

సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులు.

ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండే వీరికి బాల్యం సుఖసంతోషాలతో గడిచిపోతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం అంతర్గతంగా ఉంటుంది. జీవితంలో త్వరితంగా పైకి వస్తారు. దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు.

దేశభక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.

ఇంకా క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు.

No comments:

Post a Comment